Balakrishna Dabidi Dibide: సంవత్సరానికి సరిపడా ట్రోల్ మెటీరియల్.. ఏంట్రా ఇది?

నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పటి ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. అయితే ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ చేసే సినిమాల పరంగా గాని ఆ సినిమాల్లో ఉన్న కొన్ని సీన్స్ పరంగా గాని ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉండేవారు. ఎందుకంటే సామాన్య మానవులకు సాధ్యం కాని విషయాలను సినిమాలో నందమూరి బాలకృష్ణ పాత్రతో చేయిస్తూ ఉండేవారు దర్శకులు. ట్రైన్ వెనక్కి పంపడం కానీ కత్తులతో కాదు కంటిచూపుతో చంపేస్తాను అనడం గానీ ఇవన్నీ బాలయ్యకు మాత్రమే సాధ్యం అన్నట్టుగా ఉండేది పరిస్థితి. ఒకరకంగా ఆయనను ట్రోల్ మెటీరియల్ గా కూడా వాడేవారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని అన్ స్టాపబుల్ అనే షో మార్చేసింది. నందమూరి బాలకృష్ణ ఇమేజ్ మొత్తాన్ని ఆ షో మార్చేయడంతో ఆయనకు ఆబాల గోపాలం ఫ్యాన్స్ అయిపోయారు. ఆ తర్వాత నుంచి ఆయన నుంచి వచ్చే కంటెంట్ని కూడా అందరూ ఆదరిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు.

Deputy CM Pawan Kalyan: ఓజీ.. ఓజీ కాదు.. శ్రీశ్రీ.. శ్రీశ్రీ.. అనండి..

అయితే అనూహ్యంగా ఆయన తాజా చిత్రం డాకు మహారాజ్ నుంచి వచ్చిన దబిడి దిబిడే అనే సాంగ్ మాత్రం అందుకు భిన్నంగా ఒక ట్రోల్ మెటీరియల్ అయిపోయింది. ఊర్వశి రౌతేలతో కలిసి నందమూరి బాలకృష్ణ వేసిన స్టెప్పుల మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. నిజానికి సాంగ్ బాగుంది, వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. కానీ ఎందుకో తెలియదు నందమూరి బాలకృష్ణ డాన్స్ మీద ఇప్పుడు నెగెటివిటీ పెరిగిపోయింది. గత కొద్ది కాలంగా తమిళ ప్రేక్షకులు ఎప్పుడు తెలుగు సినిమాల నుంచి కాస్త ట్రోల్ కంటెంట్ దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నారు. వారికి ఈ కంటెంట్ దొరికినట్టు అయింది. ఇప్పుడు వారు కూడా రంగంలోకి దిగడంతో ఈ సాంగ్ మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఊర్వశితో కలిసి వేస్తున్న స్టెప్పుల మీదే ఈ ట్రోల్స్ నడుస్తున్నాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఏంట్రా ఇలా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి సాంగ్ చూసిన తరువాత మీకేం అనిపించిందో కామెంట్ చేయండి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *