Published on Dec 9, 2024 8:58 AM IST
నందమూరి నటసింహం బాలయ్య – దర్శకుడు బాబీ కాంబినేషన్ లో “డాకు మహారాజ్” సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 12, 2025న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో.. బాలకృష్ణ ‘డాకు మహారాజ్’లోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం పూర్తి చేశారు. ఇక డిసెంబర్ 15 నుండి నాన్-స్టాప్ అప్‌డేట్‌లతో ప్రమోషన్‌లను ప్లాన్ చేయాలని మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా పై బజ్‌ని మరింతగా పెంచేలా సాంగ్స్ రిలీజ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోబోతున్నారు.
కాగా ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ మరియు ఊర్వశి రౌతేలా కథానాయికలుగా నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చాందినీ చౌదరి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా బాబీ డియోల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అన్నట్టు ఈ మూవీ కచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేలా దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట.