అన్‌స్టాపబుల్ సీజన్ 4 మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతోంది. హోస్ట్ గా బాలయ్య ఎప్పటిలాగే సూపర్ సక్సెస్ ఫుల్ షోను నడిపిస్తున్నారు. ఇప్పటికి ఈ స్టేజ్ పై తెలుగు, తమిళ్, మలయాళం తో పాటు బాలీవుడ్ తారలు కూడా సందరడి చేసారు. ఇటీవల టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో ఆయన అన్నసురేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి హాజరయ్యారు. తాజగా విడుదలైన ఈ ఎపిసోడ్ సూపర్ రికార్డు వ్యూస్ తో దూసుకెళుతోంది.
ఇక రాబోయే ఎపిసోడ్ షూట్ ను ఈ రోజు మొదలెట్టారు ఆహా యూనిట్. ఈ ఎపిసోడ్ కు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రానున్నాడు. ఈ ఉదయం రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షూట్ లో పాల్గొన్నారు. అందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ టాక్ షో కు హాజరయ్యాడు రామ్ చరణ్. చరణ్ కు వెల్కమ్ చెబుతూ సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ అలాగే గేమ్ ఛేంజర్ మూడూ సినిమాలు సూపర్ హిట్ కావాలి. ఇండస్ట్రీ మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లాలి. అదే మా ఆశయం ని తెలుపుతూ స్వాగతం పలికారు నందమూరి బాలకృష్ణ. ఈ వీడియో పట్ల అటు నెటిజన్స్ ఇటు నందమూరి, మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం..!#GameChanager #RamCharan #NandamuriBalakrishna #DakuMaharaaj #UnstoppableWithNBK #NTVENT #NTVTelugu pic.twitter.com/H2PQIWyhpM
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) December 31, 2024