Thu. Mar 26th, 2026

విడుదల తేదీ : మార్చి 26, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : హర్ష్ రోషన్, శ్రీదేవి ఆపల్ల, సాయి కుమార్, గోపరాజు విజయ్ తదితరులు
దర్శకుడు : సతీష్ జవ్వాజి
నిర్మాతలు : కావ్య, శ్రావ్య
సంగీత దర్శకుడు : విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రాఫర్ : సతీష్ ముత్యాల
ఎడిటర్ : శివ ముప్పరాజు

సంబంధిత లింక్స్ :ట్రైలర్ 

‘కోర్ట్’ ఫేమ్ జోడి హర్ష్ రోషన్, శ్రీదేవి ఇప్పుడు ‘బ్యాండ్ మేళం’ అనే రొమాంటిక్ డ్రామా చిత్రంతో మనముందుకు వచ్చారు. నేడు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

యాదగిరి (హర్ష్ రోషన్), రాజి (శ్రీదేవి) చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్న బావా మరదళ్లు. రాజి చదువులో రాణిస్తుంది, కానీ యాదగిరి స్కూల్ డ్రాపౌట్. రాజి పెరిగి పెద్దయ్యాక యాదగిరిని మర్చిపోతుంది. అయితే, అతను మాత్రం ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు. అంతేగాక మ్యూజిక్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌కు చేరుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరి యాదగిరి తన జీవితంలో విజయం సాధించి, రాజి ప్రేమని ఎలా గెలుచుకున్నాడనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

కెరీర్ ప్రారంభంలో ఉన్నప్పటికీ, ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో లీడ్ పెయిర్ తమ నటనతో మెప్పించారు. హర్ష్ రోషన్ పల్లెటూరి కుర్రాడిగా చిలిపితనం మరియు అమాయకత్వంతో నీట్‌గా నటించాడు. శ్రీదేవి ఆపల్లా రాజి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. హీరోతో ఆమె కెమిస్ట్రీ బాగుంది.

ఇక ఈ సినిమాలో వచ్చే ‘తిప్పుకుంటున్నావ్’ పాట స్క్రీన్‌పై వైబ్రంట్‌గా కనిపించింది. ఫస్టాఫ్ కొంతవరకు పర్వాలేదనిపించేలా సాగింది. అక్కడక్కడా కామెడీ కూడా వర్కౌట్ అయింది. హర్ష్ రోషన్ స్నేహితులుగా నటించిన వారు తమ పాత్రల్లో బాగా చేశారు. విజయ్ బుల్గానిన్ సంగీతం వినసొంపుగా ఉంది.

మైనస్ పాయింట్స్:

‘బ్యాండ్ మేళం’లో మేజర్ డ్రా బ్యాక్ ఈ సినిమా కథ. పాతచింతకాయ పచ్చడిలా సాగే ఈ తరహా కథలు టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా సినిమాల్లో వచ్చాయి. స్క్రీన్‌ప్లేలో కూడా కొత్తదనం ఏమీ లేకపోవడం మైనస్. సాయి కుమార్ లాంటి సీనియర్ యాక్టర్స్‌కు నటించడానికి పెద్దగా స్కోప్ లభించలేదు.

ఫస్ట్ హాఫ్‌లో కొంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నప్పటికీ, సెకండాఫ్ చాలా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. కథలో ల్యాగ్ ఎక్కువగా ఉండటం వల్ల మెయిన్ పాయింట్ పక్కదారి పట్టినట్లు అనిపిస్తుంది. రన్‌టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ సినిమా చాలా లెంగ్తీ అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. కొన్ని సీన్లలో ఎమోషన్ సరిగ్గా పండలేదు. క్లైమాక్స్ వరకు ఈ సినిమా పదేళ్ల క్రితం వచ్చిన ఒక సూపర్ హిట్ సినిమాను గుర్తుకు తెస్తుంది. చివర్లో వచ్చే ట్విస్ట్ కొంత భిన్నంగా ఉన్నా, దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయారు.

సాంకేతిక విభాగం:

దర్శకుడు సతీష్ జవ్వాజి తన డైరెక్షన్‌తో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఫస్టాఫ్‌లో కొన్ని ఫన్ మూమెంట్స్ ఉన్నా, సెకండాఫ్ కథను సాగదీసింది. విజయ్ బుల్గానిన్ సంగీతం వినడానికి బాగుంది. మూడు పాటలు ఆకట్టుకుంటాయి. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే ఎడిటింగ్ మరియు స్క్రీన్‌ప్లే ఆశించిన స్థాయిలో లేవు.

తీర్పు:

ఓవరాల్‌గా చూస్తే.. ‘బ్యాండ్ మేళం’ ఎలాంటి కొత్తదనం లేని రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. హర్ష్ రోషన్, శ్రీదేవి ఆపల్ల తమ పాత్రల్లో బాగా నటించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం బాగుంది. అయితే రొటీన్ స్టోరీ లైన్, ఆకట్టుకోని సెకండాఫ్ మరియు ఎమోషన్ మిస్ కావడం ఈ సినిమాకు మేజర్ డ్రాబ్యాక్స్. రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ సినిమా అంతగా కనెక్ట్ కాకపోవచ్చు.

123telugu.com Ranking: 2.25/5

Reviewed by way of 123telugu Staff 

Click on Right here For English Assessment

The publish సమీక్ష : బ్యాండ్ మేళం – ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.