యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ హారర్ మిస్టరీ జానర్ లో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తుండగా దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి రూపొందిస్తున్నారు. కౌశిక్ గతంలో కార్తికేయ గుమ్మకొండ హీరోగా చావు కబురు చల్లగా సినిమాను రూపొందించారు.

విరూపాక్ష సక్సెస్ తర్వాత హారర్ మిస్టరీస్ టాలీవుడ్ లో ట్రెండ్ గా మారాయి. పేరున్న హీరోలు హారర్ సినిమాలు చేస్తే వాటి రేంజ్ మరింత పెరుగుతుంది. బెల్లంకొండ కొత్త సినిమాను కూడా హై టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కించనున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టైసన్ నాయుడు అనే సినిమాలో నటిస్తున్నారు. 14 రీల్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె చంద్ర రూపొందిస్తున్నారు.