Bhagya Shri Borse : నైజీరియాలో పెరిగిన నాజూకు అందాల సుందరీ.. ఇంతకీ ఎవరామె

  • టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే
  • మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ కు దొరికిన బంగారం భాగ్యశ్రీ
  • నైజీరియాలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ముద్దుగుమ్మ

Bhagya Shri Borse : భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ బ్యూటీ ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆమె రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది. రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. మిస్టర్ బచ్చన్ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఈ బ్యూటీ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో తన అందంతో అబ్బాయిల హృదయాలను కొల్లగొట్టింది. మిస్టర్ బచ్చన్ సినిమా తెరపైకి రాకముందే ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయి. భాగ్యశ్రీ డేట్స్ కోసం చాలా మంది మేకర్స్ క్యూ కడుతున్నారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. మిస్టర్ బచ్చన్ ఇంకా సెట్స్‌లో ఉండగా, భాగ్యశ్రీకి క్రేజీ ఆఫర్ వచ్చింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ బ్యూటీ గౌతమ్ తిన్ననుని దర్శకత్వంలో ‘VD 12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఒక సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శ్రీలంకలో చిత్రీకరణ జరుగుతోంది.

Read Also:Tamil Nadu: కాసేపట్లో తమిళనాడు గవర్నర్తో టీవీకే చీఫ్ విజయ్ భేటీ..

ఇదిలా ఉండగా, దుల్కర్ సల్మాన్ నటిస్తున్న సినిమాలో నటించే అవకాశాన్ని కూడా ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. వీటితో పాటు, భాగ్యశ్రీ మరికొన్ని చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో కూడా చాలా క్రేజ్ ఉంది. మ‌రి ఈ బ్యూటీ ఎక్క‌డ పుట్టి పెరిగిందో తెలుసా? అమ్మ‌డు ఔరంగాబాద్ లో పుట్టింది. కానీ పెర‌గ‌డమంతా నైజీరియాలో. ఇంట‌ర్మీడియ‌ట్ వ‌ర‌కూ నైజీరియాలోనే నడిచింది. అటుపై ముంబై షిప్ట్ అయిందిట‌. ఆ స‌మ‌యంలోనే చదువుకుంటూనే మోడ‌లింగ్ మొద‌లు పెట్టిన‌ట్లు తెలిపింది. డెయిరీ మిల్క్ యాడ్ తో మంచి పేరు రావ‌డంతో? అమ్మ‌డికి సినిమా ఛాన్సులు వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించింది. సాధార‌ణంగా రిచ్ పీపుల్ అంతా అభివృద్ది చెందిన దేశాల్లో చ‌దువుకుంటారు. అక్క‌డే స్థిర‌ప‌డ‌టానికి చూస్తారు. కానీ భాగ్య శ్రీ మాత్రం ఆర్దికంగా వెనుక‌బ‌డిన దేశంలో స్కూలింగ్ పూర్తి చేయ‌డం ఆసక్తికర విషయం. అదీ భార‌త్ ముంబై నుంచి నైజీరియా వెళ్ల‌డం విశేషం. మ‌రి ఆ ప్ర‌యాణం వెనుక ఇంకేదైనా స్టోరీ ఉందా? అన్నది తెలియాలి.

Read Also:Taliban: ఇళ్లల్లోని వంట గదులకి కిటికీలు పెట్టొద్దు.. తాలిబన్లు కొత్త నిబంధన!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *