Bhagyashree Borse Upcoming Movies List
Bhagyashree Borse Upcoming Movies List

టాలీవుడ్‌లో భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మాస్ మహారాజ్ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయినా, భాగ్యశ్రీ తన అందం, అభినయం, డ్యాన్స్ లతో ప్రేక్షకులను మెప్పించింది.

మోడలింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చిన భాగ్యశ్రీ, మొదట బాలీవుడ్‌లో యారియాన్ 2 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా విపలమవడంతో ఆమెకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ తెలుగు పరిశ్రమలో ఆమెకి క్రేజ్ రావడం గమనార్హం. మిస్టర్ బచ్చన్ ప్లాప్ అయినా, ఆమెపై ఆసక్తి మాత్రం పెరిగింది.

ప్రస్తుతం భాగ్యశ్రీ విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా, మరో ఆరు సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం. అంటే టాలీవుడ్‌లో ఆమె కెరీర్ మంచి దిశగా సాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఒక్క సినిమా ఫలితం ఒక నటుడి భవిష్యత్తును నిర్ణయించదు. భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు ప్రేక్షకులకు మంచి నటనను, డ్యాన్స్‌ను అందిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్నది. అభిమానులు ఆమె రాబోయే సినిమాలను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *