మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi) ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తుండగా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌గా ఈ మూవీని రూపొందించారు. ఇక ఈ సినిమాతో రవితేజ చాలా రోజుల తర్వాత తన జోనర్ మార్చుకున్నాడు.
ఈ సినిమాకు సంబంధించి తాజాగా రన్‌టైమ్ లాక్ అయిందనే వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి 2 గంటల 10 నిమిషాల రన్‌టైమ్ లాక్ చేశారని సినీ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది. ఇది ఈ చిత్రానికి చాలా క్రిస్పీ రన్‌టైమ్ అని చెప్పాలి. రవితేజ సినిమాలకు ఇలాంటి రన్‌టైమ్ చాలా అరుదు.
మరి నిజంగానే ఈ చిత్రానికి ఇలాంటి రన్‌టైమ్ లాక్ చేశారా అనేది వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13, 2026న రిలీజ్ కానుంది.
The put up రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’కి ఇలాంటి రన్‌టైమ్ లాక్ చేశారా..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
