Bheems Ceciroleo : టాలీవుడ్ లో దూసుకెళ్తున్న భీమ్స్..

తెలుగులో మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ అంటే దేవీశ్రీ తమన్‌ ఈ ఇద్దరితోపాటు రెండేళ్లుగా అనిరుధ్‌ పేరు కూడా మోత మోగిస్తోంది. అయితే రీసెంట్‌గా ఓ తెలుగు మ్యూజిక్‌ డైరెక్టర్‌ హవా సాగిస్తున్నాడు. టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కు తనేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నాడు.  చిన్న సినిమా అయినా  పాటతో పెద్ద హిట్‌ చేస్తున్నాడు భీమ్స్‌. వెంకటేశ్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలోని గోదారి గట్టుమీద రామచిలకే’ సాంగ్‌తో భీమ్స్‌ క్రేజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయిపోయాడు. తక్కువ టైంలో 50 మిలియన్‌ వ్యూవ్స్‌ రావడంతోపాటు సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాట రీల్సే.

వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి, దిల్‌రాజు కాంబోలో రూపొందుతున్న మూడో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ కలయికలో వచ్చిన గత రెండు సినిమాలు ఎఫ్‌2. ఎఫ్‌3కి దేవీశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. మూడో సినిమకు సంగీత దర్శకుడిగా భీమ్స్‌ను తీసుకుంటే మ్యూజికల్‌తో హైప్‌ తీసుకొచ్చాడు.  గోదారి గట్టు మీద రామ చిలకను మర్చిపోక ముందే,  వెంకటేశ్‌తో ‘బ్లాక్‌బస్టర్‌ సంక్రాంతి’ పాటను పాడించి  సినిమాకు ఊపు తీసుకొచ్చాడు.  భీమ్స్‌ పేరు ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్నా 12 ఏళ్ల క్రితమే 2012లో అల్లరి నరేశ్‌ ‘నువ్వా నేనా’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే వరుస ఫ్లాపులతో గుర్తింపు దక్కలేదు. ధమాకా క్రేజ్‌ తీసుకురాగా మ్యాడ్‌తో మరో హిట్‌ అందుకున్నాడు. దీంతో సీనియర్‌ హీరో వెంకటేశ్‌ సినిమాకు వర్క్‌ చేసే ఛాన్స్‌ కొట్టేశాడు భీమ్స్‌. మ్యాడ్‌లో కాలేజీ సాంగ్‌ స్టూడెంట్స్‌లో జోష్‌ నింపితే, దీనికి ధీటుగా స్వాతిరెడ్డి సాంగ్‌తో మ్యాడ్‌ స్క్వేర్‌కు హైప్‌ తీసుకొచ్చాడు.  దేవీశ్రీ, తమన్‌లా భీమ్స్‌ త్వరలో స్టార్స్‌ సినిమాలకు రెగ్యులర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయ్యే ఛాన్స్‌ వుంది. ప్రస్తుతం రవితేజ ‘మాస్‌ జాతర’కు అడవి శేషు ‘డెకాయిట్‌’కు మ్యూజిక్‌ ఇస్తున్నాడు భీమ్స్.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *