Published on Jan 5, 2025 8:01 AM IST
కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి స్పెషల్ గా రాబోతుంది. ఐతే, అనిల్ రావిపూడి.. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఈ సందర్భంగా చిరుతో సినిమా పై అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారితో ఏ కథ చేస్తే వర్క్ అవుట్ అవుతుందో.. ఏది చేస్తే ఆయనను నెక్స్ట్ లెవెల్ కి చూపించొచ్చో అలానే సినిమా చేస్తా’ అని చెప్పారు.
‘కొంతమంది డైరెక్టర్లు వింటేజ్ చిరంజీవి గారిని చూపిస్తాను అని చెప్పి ఆ మార్క్ మిస్ అవుతున్నారు. నిజానికి, ఆడియన్స్ మాకు వింటేజ్ చిరంజీవి గారు వద్దు, ఇప్పుడున్న స్టేజ్ లో చిరంజీవిగారు ఎలా ఉన్నారో.. అలాగే ఆయన ఏజ్ కి తగ్గ మంచి కథను చెప్పండి అని ప్రేక్షకులు కోరుకుంటున్నారు’ అని అడిగిన ప్రశ్నకు.. అనిల్ సమాధానమిస్తూ.. చిరంజీవిగారి సినిమా అంటే అన్ని ఎమోషన్స్ ఉంటాయి. కామెడీ, యాక్షన్.. ఎమోషన్ ఇలా అన్ని ఆయన సినిమాలో ఉంటాయి’ అని అనిల్ చెప్పుకొచ్చాడు. అలాగే, చిరంజీవితో చేయబోయే సినిమాకి కూడా భీమ్స్ సిసిరోలియోనే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటాను’ అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.