గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా ఈ నెల 25వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఇవాళ ఉగాది సందర్భంగా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఈ అనౌన్స్ మెంట్ చేసింది. భీమా సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించారు.

కన్నడ దర్శకుడు హర్ష రూపొందించారు. పవర్ ఫుల్ పోలీస్ కథతో తెరకెక్కిన భీమా సినిమా గత నెల 8వ తేదీన థియేటర్స్ లోకి వచ్చింది. ఈ చిత్రంలో ప్రియ భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. మాస్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది భీమా. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలున్నాయి.