RAPO22 నుండి బిగ్ అప్డేట్.. డిసెంబర్ 6న వచ్చేస్తున్నాడు! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 5, 2024 7:00 PM IST

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తన కెరీర్‌లోని 22వ చిత్రాన్ని రీసెంట్‌గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మహేష్ బాబు.పి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను పూర్తి లవ్ స్టోరీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమా నుండి తాజాగా ఓ బిగ్ అప్డేట్ అయితే మేకర్స్ ఇచ్చారు.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిసెంబర్ 6న ఉదయం 10.08 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘మీకు సుపరిచితుడు.. మీలో ఒకడు..’ అనే డైలాగ్‌తో హీరో పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రీ-లుక్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు.

ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈ సినిమాలో హీరో పాత్ర ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *