Mon. Oct 13th, 2025
Bigg Boss 9 : కాంట్రవర్సీ ఉన్నోళ్లే కావాలి.. బిగ్ బాస్ తిడుతున్నా పట్టించుకోవా..

Bigg Boss 9 : తెలుగు నాట బిగ్ బాస్ తీసుకుంటున్న నిర్ణయాలు మరింత వివాదాస్పదం అవుతున్నాయి. ఒకప్పుడు బిగ్ బాస్ అంటే కొంచెం ఫేమ్ ఉన్న వాళ్లను, యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వారిని తీసుకొచ్చేవారు. అప్పుడు చూడటానికి కూడా బాగుండేది. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం కాంట్రవర్సీ ఉన్నోళ్లనే తీసుకొస్తున్నారు. అదే చూడటానికి చాలా చెండాలంగా అనిపిస్తోంది ప్రేక్షకులకు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-9లో చూసుకుంటే రీతూ చౌదరి, సంజనా లాంటి వాళ్లపై ఎన్ని రకాల వివాదాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినా సరే వాళ్లను హౌస్ నుంచి పంపించేయకుండా అలాగే ఉంచేశారు.

learn additionally : Rakul Preet : కత్తిలాంటి అందాలతో రకుల్ రచ్చ..

ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అలేఖ్య చిట్టి పికిల్స్ తో రెండు రాష్ట్రాల్లో తీవ్ర వివాదాస్పదం అయిన రమ్య మోక్షను తీసుకొచ్చారు. ఆమెకు తోడు దివ్వెల మాధురిని తెచ్చారు. వీళ్లిద్దరూ ఏ స్థాయిలో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రమ్య మోక్ష అయినా ఒకింత పర్లేదు గానీ.. మాధురిని తేవడంపై తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె ఏపీ రాజకీయాల్లో అతిపెద్ద వివాదంగా మారింది. ఇప్పటికీ ఆమెను దువ్వాడ శ్రీనివాస్ భార్య, కూతురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాంటి ఆమెను హౌస్ లోకి తెచ్చి ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. బిగ్ బాస్ ను లక్షల మంది చూస్తుంటారు. అలాంటి వారి పట్ల బిగ్ బాస్ మేనేజ్ మెంట్ కు బాధ్యత లేదా.. ఏం మెసేజ్ ఇస్తున్నాం, హౌస్ లోకి ఎలాంటి వారిని తీసుకొస్తున్నాం అనేది కనీసం చూసుకోవాలి కదా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

learn additionally : Fauji : ఫౌజీ రిలీజ్ డేట్ పై వార్తలు.. నిజమేనా..?