Mon. Oct 13th, 2025
Bigg Boss 9 : తప్పు చేశాం.. పచ్చళ్ల పాప రమ్య మోక్ష కామెంట్స్

Bigg Boss 9 : అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష అంటే తెలియని సోషల్ మీడియా యూజరే ఉండరు. ఆ రేంజ్ లో ఆమె ఫేమస్ అయింది. ఇక ఓ కస్టమర్ ను తిట్టారనే వీడియో వైరల్ అయిన తర్వాత ఆమె గురించి సోషల్ మీడియా మొత్తం ఓ రేంజ్ లో ట్రోల్స్ చేశారు. అలాంటి రమ్య ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-9లో అడుగు పెట్టింది. వైల్డ్ కార్డు ద్వారా నేడు మొదటి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె ఓ స్పెషల్ వీడియోలో మాట్లాడింది. తాను ఎన్నో అవమానాలు భరించిన తర్వాత ఈ స్థాయి దాకా వచ్చినట్టు తెలిపింది.

Learn Additionally : Fauji : ఫౌజీ రిలీజ్ డేట్ పై వార్తలు.. నిజమేనా..?

నేను ఫిట్ నెస్ వీడియోలతో ఫేమస్ అయిన తర్వాత పచ్చళ్ల బిజినెస్ పెట్టాం. అది బాగా నడిచింది. ఆ టైమ్ లోనే ఓ సినిమా షూట్ కోసం కొడైకెనాల్ వెళ్లాను. వచ్చేసరికి మా నాన్న చనిపోయారు. ఆయన చివరి చూపు చూసేందుకు చాలా ఇబ్బంది పడ్డాను. ఆయన చనిపోయిన రెండు వారాలకే ఆడియో లీక్ అంటూ సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో మమ్మల్ని చాలా ట్రోల్స్ చేశారు. అందరూ తిట్టారు. మా బిజినెస్ మూసుకునే పరిస్థితి వచ్చింది. అలా తిట్టి మేం తప్పు చేశాం. కెరీర్ మీద ఫోకస్ చేయమన్నారు కాబట్టే ఇక్కడకు వచ్చా. బిగ్ బాస్ లో నా తడాఖా ఏంటో చూపిస్తా అంటూ తెలిపింది ఈ బ్యూటీ.

Learn Additionally : Samantha : కొత్త ఇంట్లో అడుగు పెట్టిన సమంత.. పూజలు