‘బిగ్ బాస్’ హౌస్ లో ‘క’ టీమ్ ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 27, 2024 6:07 PM IST


‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 8’ మొత్తానికి ఆస‌క్తి రేపుతూ ఎనిమిదో వారానికి చేరుకుంది. అయితే, దీపావ‌ళి పండగ సంద‌ర్భంగా విడుదలైన ప్రోమోలో, హౌజ్‌మేట్స్ అందరూ కలిసి దీపావ‌ళి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘క’ సినిమా టీమ్ ‘బిగ్ బాస్’ హౌస్ కి వచ్చింది. కిరణ్ అబ్బవరం, తన్వీ రామ్, నయన సారిక పాల్గొన్నారు. కింగ్ నాగార్జునతో కిరణ్ అబ్బవరం తన ‘క’ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

దీపావ‌ళి పండగ సంద‌ర్భంగా విడుదలైన ఈ ప్రోమో మొత్తానికి ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచింది. ఇక ‘క’ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను సుజిత్, సందీప్ ద్వయం డైరెక్ట్ చేశారు. పీరియాడిక్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రం రానుంది. మలయాళంలో ‘క’ చిత్రాన్ని నటుడు దుల్కర్ సల్మాన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఐతే, ‘లక్కీ భాస్కర్’ సినిమా అదే రోజున రిలీజ్ అవుతుండటంతో అక్కడ సినిమా వాయిదా పడింది. అలాగే, తమిళంలోనూ ‘క’ సినిమా వాయిదా పడింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *