Biggboss Sonia : బిగ్ బాస్ సోనియా పెళ్లి.. కనిపించని పెద్దోడు.. చిన్నోడు

  • పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ సోనియా
  • వేడుకలో కనిపించని పెద్దోడు, చిన్నోడు
  • ముగ్గురికీ చెడిందా అంటూ నెటిజన్స్ కామెంట్స్

Biggboss Sonia : బిగ్ బాస్ సీజన్ 8 పూర్తయింది. విజేతగా నిఖిల్ నిలవగా.. రన్నర్ గా గౌతమ్ నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్న నాలుగైదు వారాల్లో అయినా తన మార్క్ చూపించిన కంటెస్టెంట్ సోనియా ఆకుల. ఆర్జీవి సినిమాల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఒక స్వచ్చంధ సేవా సంస్థ కూడా నడిపిస్తుందని తెలిసి తన మీద ఆడియన్స్ కు రెస్పెక్ట్ పెరిగింది. బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించిన ఆమె హౌస్ లో వెళ్లిన రెండో వారం లోనే నిఖిల్, పృథ్వీలకు బాగా దగ్గరైంది. ఒక దశలో ఆమె ఏం చెబితే అది చేసేలా తయారయ్యారన్న కామెంట్లు కూడా వచ్చాయి. ముందు వాళ్లిద్దరితో క్లోజ్ గా ఉంటూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తుందా అని అభిమానులకు డౌట్ రాగా సడన్ గా పెద్దోడు చిన్నోడు అంటూ నాలుక మడతపెట్టేసింది. అంతేకాదు తనకు యష్ అనే వేరే వ్యక్తితో ఉన్న లవ్ స్టోరీని బయటపెట్టేసింది. బయటకు వెళ్లిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. అంతా బాగుంది కానీ సోనియా నిఖిల్ పృథ్వీ ఈ ముగ్గురి మధ్య మొదటి మూడు వారాలు జరిగిన డిస్కషన్ సోనియా మీద ఓ రేంజ్ లో నెగిటివిటీ వచ్చేలా చేసింది. వాళ్లిద్దరిని కొంగున కట్టేసుకుని ఆడిస్తుందన్న టాక్ వచ్చింది. ఆ నెగిటివిటీ వల్లే సోనియా ఎలిమినేట్ అయ్యింది. ఆమె వెళ్లిన తర్వాతనే నిఖిల్, పృథ్వీ అసలు ఆటలో నిమగ్నమయ్యారు.

Read Also:Free Bus Scheme in AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

అయితే బయటకు వచ్చిన సోనియా మళ్లీ బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం నామినేషన్స్ కోసం వెళ్లి అనూహ్యంగా నిఖిల్ ని నామినేట్ చేసింది. ఆ సమయంలో సోనియా నిఖిల్ ని ఇరికించే ప్రయత్నం చేసింది. నామినేట్ చేసి మళ్లీ చివర్లో నువ్వు గెలవాలని అనుకుంటున్నా అంటూ భుజం తట్టి బయటకు వచ్చేసింది. ఐతే సోనియా ఈ స్ట్రాటజీ ఏంటో నిఖిల్‎కి అర్ధం కాలేదు. ఫైనల్ గా బయటకు వచ్చిన సోనియా యష్‎తో నిశ్చితార్థం జరుపుకుంది. శుక్రవారం వీరి మ్యారేజ్ చాలా గ్రాండ్ గా జరిగింది. సోనియా మ్యారేజ్ కి పెద్దోడు చిన్నోడు అదే నిఖిల్, పృథ్వీలు అటెండ్ అయినట్లు కనిపించలేదు. బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ తర్వాత వీళ్లు మళ్లీ కలిసినట్లు లేరు. సోనియా మ్యారేజ్ కి సీజన్ 8 కంటెస్టెంట్స్ తేజ, రోహిణి, మణికంఠ, నైనిక అటెండ్ అయ్యారు. వారితో పాటు అమర్ దీప్, తేజశ్విని కూడా వచ్చారు. కానీ నిఖిల్, పృథ్వీలు మాత్రం రాలేదు. మరి పెద్దోడు చిన్నోడు సోనియా మ్యారేజ్ కు అటెండ్ అవ్వకపోవడానికి వెనక కారణాలు ఏంటో.. వీళ్ల ముగ్గురి మధ్య ఏం జరిగింది అని ఆడియన్స్ ప్రశ్నలు వేసుకుంటున్నారు.

Read Also:Minister Seethakka: రైతులపై సంకెళ్లు వేసిన చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీది

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *