
టాలీవుడ్ మరియు కోలీవుడ్‌లో స్టార్ హీరోలు తమకిచ్చిన ప్రతి కథను ఒప్పుకోవడం సాధ్యం కాదు. కొన్ని సినిమాలు కథ విని రిజెక్ట్ చేస్తారు, అయితే ఆ చిత్రాలు తర్వాత బ్లాక్ బస్టర్ హిట్స్‌గా మారతాయి. అలాంటి లక్కీ మిస్‌ల లిస్ట్‌లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా ఉన్నాడు. అతను రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాలు అజిత్, విజయ్, ప్రభాస్, కార్తీ తదితర హీరోల చేతిలో ఘనవిజయం సాధించాయి.
మొదటగా, ఆశై సినిమా మొదట సూర్యకు ఆఫర్ ఇచ్చారు. అయితే, సూర్య ఈ కథను రిజెక్ట్ చేయడంతో అజిత్ సినిమాను చేసి కెరీర్‌లో బిగ్ హిట్ అందుకున్నాడు. అలాగే, తుపాకి సినిమాలో సూర్య నటించాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల అతను ఈ ప్రాజెక్ట్‌ను వదిలేయడం వల్ల విజయ్ ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.
అలాగే, రాజమౌళి బాహుబలి కథను మొదట సూర్యకు చెప్పారని టాక్. కానీ, సూర్య “నా స్టైల్ కి సెట్ కావదు” అంటూ సినిమాను రిజెక్ట్ చేసాడని తెలుస్తుంది. చివరికి ప్రభాస్ ఈ ప్రాజెక్ట్‌ను తనదిగా మార్చుకొని పాన్-ఇండియా స్టార్ అయ్యాడు. ఇక పరుత్తివీరన్ సినిమాలోనూ మొదట సూర్యను తీసుకునే ఆలోచన ఉండగా, తమ్ముడు కార్తీకి క్యారెక్టర్ బాగా సూట్ అవుతుందని భావించి అతనే సినిమాలో హీరోగా నటించేందుకు సపోర్ట్ చేశాడు.
సూర్య రిజెక్ట్ చేసిన ఈ సినిమాలు చివరికి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లుగా మారాయి. అయితే, తాను ఒప్పుకుని ఉంటే తన కెరీర్ ఇంకెంత బలమైనదిగా మారేదో అనే చర్చ ఇప్పటికీ నడుస్తూనే ఉంది.