యానిమల్ సినిమాలో విలన్ గా పేరు తెచ్చుకున్న బాబీ డియోల్ కు టాలీవుడ్ గ్రాండ్ వెల్కమ్ చెబుతోంది. ఇప్పటికే ఈ నటుడు బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా సెట్ లో జాయిన్ అయ్యారు. బాబీ డియోల్ మరో క్రేజీ ప్రాజెక్ట్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో ఆయనను ఓ కీ రోల్ కోసం సెలెక్ట్ చేశారట.

బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆర్ సీ 16 వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాబీ డియోల్ రామ్ చరణ్ కు సపోర్ట్ గా నిలబడే క్యారెక్టర్ లో కనిపించనున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఆర్ సీ 16 సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.