Bobby Comments :  ఆ నిర్మాత అడిగిన బడ్జెట్ ఇవ్వలేదు.. ఎవరంటే..?

నందమూరి బాలకృష్ణ హీరోగా సూపర్ హిట్ సినిమాల దర్శకుడు బాబీ తెరక్కెక్కించిన చిత్రం ‘ డాకు మహారాజ్’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమాలోని రెండు పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.

అందులో భాగంగానే చిత్ర దర్శకుడు బాబీ పలువురు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబీ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. బాబీ మాట్లాడుతూ ‘ నా కెరీర్  ఓ  సినిమా విషయంలో చాలా బాధపడ్డాను. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ ఆ నిర్మాణ సంస్థ నేను అడిగిన బడ్జెట్ ఇచ్చి ఉంటె ఇంకా బాగా తీసిఉండేవాడిని. నేను ఎంత అడిగిన బడ్జెట్ ఇవ్వలేదు. ఆ సమయంలో చాలా బాధేసింది’ అని అన్నారు. అయితే ఇప్పుడు బాబీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ సర్దార్ గబ్బర్ సింగ్ పైనే కొందరంటుంటే కాదు జై లవకుశ పై అని మరికొందరి వాదన. సర్దార్ ప్లాప్.. సో ఇవి జై లవకుశ మేకర్స్ నుద్దేశించి అనేది మరికొందరి మాట. ఇక రాబోయే డాకు మహారాజ్ తో బాలయ్యకు బిగ్గెస్ట్ హిట్ ఇస్తున్నాను అని ఎప్పుడు చూడని బాలయ్యని చూస్తారని అని అన్నారు దర్శకుడు బాబీ.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *