నటసింహం బాలయ్య – దర్శకుడు బాబీ కాంబినేషన్ లో “డాకు మహారాజ్” సినిమా సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాబీ ఈ సినిమా కథా నేపథ్యం పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలయ్యతో సినిమా అనుకోగానే ముందుగా స్టోరీ వరల్డ్ గురించే ఎక్కువ ఆలోచించాను అని, సినిమాలో కొత్త ప్రపంచాన్ని చూస్తారని.. ప్రేక్షకులను కచ్చితంగా కొత్త అనుభూతిని ఇస్తోంది అని బాబీ చెప్పుకొచ్చారు.
ఇక “డాకు మహారాజ్” సినిమా జనవరి 12, 2025న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. కాగా ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ మరియు ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చాందినీ చౌదరి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా బాబీ డియోల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
The post ‘డాకు మహారాజ్’ స్టోరీ వరల్డ్ పై క్రేజీ అప్ డేట్ ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.