అఫీషియల్: ఓరోజు ముందే “పుష్ప 2” వరల్డ్ వైడ్ టేకోవర్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ కోసం యావత్ ఇండియన్ ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా, బన్నీ మరోసారి బాక్సాఫీస్ భరతం పట్టేందుకు సిద్ధమయ్యాడు.

ఇక ఈ సినిమాను డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. దీంతో ఈ సినిమాకు పోటీగా తమ సినిమా రాకుండా చాలా మంది మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. పుష్పరాజ్ మేనియా ముందు తమ సినిమా కొట్టుకుపోతే ఫలితం ఉండదని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ మూవీ ‘ఛావా’ ప్రమోషన్స్‌లో ఏమాత్రం దూసుకెళ్లడం లేదు. ఈ చిత్రాన్ని కూడా డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ చేయాలని ఆ చిత్ర మేకర్స్ భావిస్తున్నారు.

అయితే, పుష్ప-2 చిత్రానికి నార్త్‌లో నెలకొన్న క్రేజ్ దృశ్ట్యా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తారనే టాక్ బి-టౌన్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మరి నిజంగానే ‘పుష్ప-2’ మూవీ కారణంగా బాలీవుడ్ మూవీ ‘ఛావా’ వాయిదా పడుతుందా లేదా అనేది వేచి చూడాలి.

The post పుష్పరాజ్ దెబ్బకి బాలీవుడ్ వెనకడుగు వేసిందా..? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *