Boney Kapoor: “అల్లు అర్జున్‌ను నిందించాల్సిన అవసరం లేదు”.. బాలీవుడ్ నిర్మాత కీలక వ్యాఖ్యలు

  • సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన
  • తాజాగా ఈ ఘటనపై స్పందించిన బాలీవుడ్ నిర్మాత
  • ఇందులో అల్లు అర్జున్‌ను నిందించాల్సిన అవసరం లేదన్న బోనీకపూర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీ తేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై యుగంధర్ గౌడ్ అనే వ్యక్తి జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. ఆయన ఢిల్లీలోని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది.

READ MORE: AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్.. 14 అంశాల ఎజెండాలకు ఆమోదం! ప్రధాని పర్యటనపై చర్చ

తాజాగా ఈ ఘటనపై ప్రముఖ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ స్పందించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. జనాలు ఎక్కువమంది రావడం వల్లే ఆ ఘటన జరిగిందన్నారు. ఇందులో అల్లు అర్జున్‌ను తప్పేం లేదని.. నిందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘‘దక్షిణాది రాష్ట్రాల్లో ప్రేక్షకులకు యాక్టర్‌లకు ఎక్కువగా అభిమానిస్తారు. అజిత్‌ నటించిన ఓ సినిమాను చూసేందుకు థియోటర్ వద్దకు అర్ధరాత్రి వెళ్లాను. అక్కడ దాదాపు 20వేల మంది పోగయ్యారు. థియోటర్ వద్ద నేను అంత మందిని చూడటం అదే మొదటి సారి. పూర్తి సినిమా చూసి బయటకు వచ్చే సరికి సమయం నాలుగు అయ్యింది. అయినా.. థియోటర్ బయట చాలా మది అభిమానులు అలాగే ఎదురు చూస్తూ నిలబడ్డారు. రజనీకాంత్‌, చిరంజీవి, రామ్‌ చరణ్‌, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌ వంటి పెద్ద హీరోలు అభిమానులు ఎక్కువగా ఉంటారు. వారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు.. అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఎక్కువ మంది జనాలు రావడంతో ఆ ఘటన(సంధ్య థియోటర్ తొక్కిసలాట) జరిగింది. ఇందులో అల్లు అర్జున్‌ను నిందించాల్సిన అవసరం లేదు’’ అని బోనీకపూర్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

READ MORE: Keerthi Suresh : 15ఏళ్ల పాటు అతడి ప్రేమలో మునిగిపోయిన కీర్తి సురేష్.. చివరికి ?

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *