
బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ రహస్య వివాహం చేసుకున్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రాక్‌స్టార్’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన నర్గీస్, మద్రాస్ కేఫ్, డిష్యూం, హౌస్‌ఫుల్-3 వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తోంది. అయితే తాజాగా ఆమె లాస్ ఏంజిల్స్‌లో వ్యాపారవేత్త టోనీని రహస్యంగా వివాహం చేసుకున్నట్లు సమాచారం.
ఈ ప్రైవేట్ వెడ్డింగ్‌లో కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులే హాజరయ్యారు. ఈ వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నర్గీస్, టోనీ తమ హనీమూన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లినట్లు సమాచారం. టోనీ ‘ది డియోస్ గ్రూప్’ అనే దుస్తుల సంస్థ వ్యవస్థాపకుడు. 2006లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన టోనీ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో నివసిస్తున్నాడు.
నర్గీస్ 2011లో ‘రాక్‌స్టార్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హాలీవుడ్ సినిమా ‘స్పై’లో కూడా నటించింది. గత కొన్నేళ్లుగా టోనీతో డేటింగ్లో ఉన్న ఆమె ఇప్పుడు ఆయనను వివాహం చేసుకోవడంతో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. నర్గీస్ పెళ్లి వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
నర్గీస్ వెడ్డింగ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆమె పెళ్లి కేక్‌పై ‘నర్గీస్-టోనీ’ అని రాసి ఉండటంతో వీరిద్దరి ప్రేమకథ ఎలాంటి అందమైన మలుపు తీసుకుందో స్పష్టమవుతోంది. ఈ బ్యూటిఫుల్ కపుల్ కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించగా, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.