Bollywood villains ruling South cinema
Bollywood villains ruling South cinema

ఇటీవల టాలీవుడ్‌లో బాలీవుడ్ విలన్ల హవా బాగా పెరిగింది. సంజయ్ దత్, బాబీ డియోల్ లాంటి స్టార్లు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ విలన్స్ గా మారిపోయారు. హీరోలుగా కెరీర్ ప్రారంభించిన వీరు ఇప్పుడు పవర్‌ఫుల్ విలన్ పాత్రల్లో అదరగొడుతున్నారు. కేజీఎఫ్ 2 సినిమాతో సంజయ్ దత్‌ కి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత విజయ్ “లియో” లో విలన్‌గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఇక తెలుగులో “డబుల్ ఇస్మార్ట్” ద్వారా అడుగుపెట్టిన సంజయ్ దత్, ప్రస్తుతం “రాజా సాబ్”, “సంబరాల యేటిగట్టు” చిత్రాల్లో నటించనున్నట్లు సమాచారం. మరోవైపు, బాబీ డియోల్ కూడా “యానిమల్” సినిమా ద్వారా కొత్త ఉత్సాహాన్ని పొందారు. గతంలో పెద్దగా అవకాశాలు లేని బాబీ, ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో భారీ ప్రాజెక్టులు కైవసం చేసుకుంటున్నారు.

“డాకు మహారాజ్” సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాబీ డియోల్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు”, ప్రభాస్ “స్పిరిట్”, విజయ్ “జననాయకన్” వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. వీరి స్టైలిష్ లుక్స్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ సౌత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇకపై టాలీవుడ్ విలన్ క్యారెక్టర్స్‌కి బాలీవుడ్ యాక్టర్లు రెగ్యులర్ ఛాయిస్ అవ్వడం ఖాయం. సౌత్ సినిమాల్లో గ్రిప్పింగ్ స్క్రిప్ట్స్, పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయనే కారణంగా ఈ స్టార్ యాక్టర్లు సౌత్‌కి ఎక్కువగా వస్తున్నారు. బాలీవుడ్ విలన్ల హవా ఇలాగే కొనసాగుతుందా? అనేది చూడాలి!

By admin