Rewind 2024 : బాలీవుడ్‌ ‘ఖాన్‌’ల ప్రభావం తగ్గుతోంది.. ఇదే సాక్ష్యం

బాలీవుడ్‌ను శాసించిన ఖాన్‌ హీరోల ప్రభ తగ్గింది. ఈ ఏడాది ఒక్కరూ కనిపించలేదు. వరుస ఫ్లాపులతో గ్యాప్‌లో పడిపోయారు. సల్మాన్, షారుక్, అమిర్ లు సినిమాలు చేయడం తగ్గించేశారు. సల్మాన్, అమిర్ హిట్లు లేక వెనకబడ్డారు. ఇక షారుక్ ఒక హిట్టు ఒక ప్లాప్ అన్నట్టు సాగుతున్నాడు. ఖాన్ త్రయం డైరీ ఒకసారి పరిశీలిస్తే.

సల్మాన్ ఖాన్ : రేస్‌ 3తర్వాత హిట్‌ లేని సల్లూభాయ్‌ బాక్సాఫీస్‌ వద్ద గట్టెక్కలేక ఇబ్బందులుపడుతున్నాడు. 100 కోట్లు కలెక్ట్‌ చేయలేని పరిస్థితికి ఈ టాప్‌ హీరో గ్రాఫ్‌ పడిపోయింది. సక్సెస్‌ కోసం ఏం చేయాలో తెలీక ఫ్యాంఛైజీ మూవీస్‌ చేశాడు. టైగర్‌3, దబంగ్‌3తో వచ్చినా వర్కవుట్‌ కాలేదు. రాధే, కిసీ భాయ్‌ కిసి కి జాన్‌ వంటి కంటిన్యూస్‌ ఫ్లాపులతో సల్మాన్‌ ఇమేజ్‌ డ్యామేజ్‌ అయింది. వచ్చే ఏడాది తనకు కలిసొచ్చిన ఈద్‌కు సికిందర్‌తో వస్తున్నాడు. బాలీవుడ్‌ తొలి రూ. 100 కోట్ల మూవీ ‘గజిని’ తీసిన మురుగదాస్‌ దర్శకత్వంలో సికిందర్‌’ మూవీతో వస్తున్నాడు సల్మాన్‌.

షారుక్ ఖాన్ : ఇక షారూక్‌ ఖాన్‌ వచ్చి ఏడాది దాటింది. పఠాన్‌, జవాన్‌ వంటి వరుస హిట్స్‌ తర్వాత హ్యాట్రిక్‌ కలను ‘డంకీ’ నీరుకార్చింది. ఫ్లాప్‌ లేని రాజ్‌కుమార్‌ హిరాణీ డైరెక్షన్‌లో నటించినా అదే టైంలో వచ్చిన ‘సలార్‌’ డంకీని దెబ్బ కొట్టింది. దీంతో నెక్ట్స్‌ ఎలాంటి మూవీ చేయాలా? అన్న డైలమాతో గ్యాప్‌లో పడిపోయిన షారూక్‌ ఏడాది దాటినా మరో మూవీని సార్ట్ చేయలేదు. షారూక్‌ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి కింగ్‌ మూవీ చేస్తున్నట్టు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సుజయ్‌ ఘోష్‌ దర్శకత్వంలో యాక్షన్‌ మూవీగా రూపొందనుంది. అభిషేక్‌ బచ్చన్‌ విలన్‌గా నటిస్తాడంటూ ప్రచారం జరుగుతున్న ఈ సినిమా మార్చిలో సెట్ష్‌పైకి వచ్చే అవకాశం వుంది.

అమీర్ ఖాన్ : వరుసగా రెండు ఫ్లాపులు అమీర్‌ను కృంగదీశాయి. అమితాబ్‌తో కలిసి నటించిన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’తో డౌన్‌ఫాల్‌ మొదలైంది. అమీర్‌ లాస్ట్ మూవీ ‘లాల్‌సింగ్‌ చద్దా’ అయితే థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌ను మించి డిజాస్టర్‌ అయింది. దీంతో అమీర్‌ తీసుకున్న అనూహ్య నిర్ణయం షాక్‌ ఇచ్చింది. ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ  ‘నటించడం మొదలుపెట్టి 35 ఏళ్లయింది. ఏదో నష్టపోయానని అనిపించడంతో కొంత విరామం తీసుకోవాలనుకుంటున్నాను. నిరంతరం పని గురించే ఆలోచించడం సరైంది కాదనిస్తోంది. కుటుంబంతో గడపాలనుకుంటున్నాను. ఇంకో ఏడాదిపాటు కెమెరాముందుకు రానని ప్రకటించాడు. ఇలా కావాలనే గ్యాప్‌ తీసుకుని. ‘సితారే జమీన్‌ పర్‌’లో నటిస్తున్నాడు. మరోవైపు రజనీకాంత్‌ కూలీలో గెస్ట్‌ అపీరియన్స్‌ ఇస్తున్నాడు.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *