- అఖండ 2 పనుల్లో బిజీగా ఉన్న బోయపాటి
- హిట్ కొట్టాలన్న కసితో పని చేస్తున్న బోయపాటి
- తర్వాత చిరు-బాలయ్య ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టే అవకాశం
Boyapati : బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఈ మధ్య కాలంలో హిట్ కోసం పరితపిస్తున్నారు. చివరగా ఆయన రామ్ తో తీసిన స్కంద సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తదుపరి సినిమాల పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బాలయ్యతో తీస్తున్నారు. ఇక తర్వాత చిత్రం కూడా కన్పమ్ అయినట్లే అని అంటున్నారు. కాకపోతే ఇందులో కాస్త మార్పు రాబోతుంది. బాలయ్యతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇద్దరి కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పబ్లిక్ గానే బోయపాటిని ఇద్దరి ఇమేజ్ కి తగ్గ స్టోరీ రెడీ చేయమని చెప్పేసారు.
Read Also:TG Cold Weather: మరోసారి పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పలుచోట్ల కమ్ముకున్న పొగమంచు
ఇంత గొప్ప అవకాశం కేవలం బోయపాటి కి చిరంజీవి అందించారు. ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నా.. వాళ్లందరినీ పక్కన బెట్టి మరీ ఆ ఛాన్స్ నీదే అంటూ పబ్లిక్ గా చెప్పారు. మరి ఈ ఛాన్స్ బోయపాటి ఎందుకు వదులు కుంటాడు? బాలయ్యకే కొత్త ఇమేజ్ ని తీసుకొచ్చిన బోయపాటి ఆ ఇద్దరినీ తెరపై చూపించడానికి ఇంకే స్థాయిలో కసరత్తులు చేస్తారనడంలో ఆశ్చర్యం లేదు. ఇద్దరి మాస్ ఇమేజ్ కి తగ్గ కథ చేయడం అంటే అంత సులభం కూడా కాదు.
Read Also:IND vs AUS: ఆదుకున్న నితీష్.. లంచ్ సమయానికి టీమిండియా 244/7
దీనిపై బోయపాటి చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే ‘అఖండ తాంవడం’ తర్వాత ఈ ప్రాజెక్ట్ పై బోయపాటి పని మొదలు పెడతారని సమాచారం. ప్రస్తుతం బాలయ్య హీరోగా ‘అఖండ తావడం’ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలన్నది బోయపాటి ప్లాన్ . ఇంతవరకూ ఆ కాంబినేషన్ ఫెయిలైంది లేదు. సింహా, లెజెండ్, అఖండ మూడు చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టారు. ‘అఖండ తాండవం’తో నాల్గవ హిట్ ఇచ్చి డబుల్ హ్యాట్రిక్ లైన్ వేయాలని చూస్తున్నారు బోయపాటి. అఖండ తావడం షూటింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసి దసరాకి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అనంతరం బోయపాటి చిరు-బాలయ్య ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. అటుపై చిత్రాన్ని 2026లో విడుదల చేయనున్నారు.