Published on Dec 14, 2024 11:59 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ ‘పుష్ప 2’ ఈ డిసెంబర్ 5న విడుదల కాగా నాలుగో తేదీ సాయంత్రం నుండి పలుచోట్ల ఈ చిత్ర ప్రీమియర్ షోలు వేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్లో ఈ సినిమా ప్రీమియర్ షో జరిగింది. అయితే ప్రతి సినిమాకి వెళ్లినట్లే ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లకు వెళ్లడం జరిగింది. అయితే అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో ఉన్న సమయంలో ఫ్యాన్స్ మధ్య తొక్కేసేలాట జరిగింది.
ఆ సంఘటనలో ఒక మహిళ మరణించగా ఆమె కుమారుడు గాయాల పాలయ్యాడు. ఆ సంగతి తెలిసిన అల్లు అర్జున్ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చనిపోయిన ఆ మహిళకు సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి తన వంతుగా 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం పండగ చేస్తానని, అలాగే ఆ కుటుంబానికి ఏ విషయంలో అయినా అండగా ఉంటాను అని తెలిపారు. ఆ బాలుడికి కావలసిన వైద్య సదుపాయాల నిమిత్తం ఖర్చు అంతా తానే చూసుకుంటానని అల్లు అర్జున్ చెప్పడం జరిగింది.
అయితే ఈరోజు గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో ప్రధాన వ్యక్తి గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ అధినేత అల్లు అర్జున్ కి అత్యంత ఆప్తుడు కూడా అయినటువంటి బన్నీవాస్ ఆ బాలుడు చికిత్స పొందుతున్న హాస్పిటల్ కు వెళ్లి అతడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో సంప్రదించి తెలుసుకోవడం జరిగింది. చనిపోయిన మహిళకు సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారు. అంతేకాక వారికి ఎటువంటి విషయంలో అయినా తాము అండగా ఉంటామని, హాస్పిటల్ కు సంబంధించిన ఖర్చుమంతా తాము భరిస్తాం అని ఈ సందర్భంగా నిర్మాత బన్నీవాస్ వారికి చెప్పి వారికి మానసికంగా ఆర్ధికంగా కూడా భరోసా ఇచ్చి వచ్చారు.