Published on Jan 5, 2025 12:41 AM IST
హీరో అల్లరి నరేష్ నటించిన రీసెంట్ మూవీ ‘బచ్చల మల్లి’ రిలీజ్‌కు ముందు మంచి అంచనాలను క్రియేట్ చేసింది. అల్లరి నరేష్ నుంచి వస్తున్న మరో సీరియస్ మూవీ కావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని కనబరిచారు. అయితే, ఈ సినిమా రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ టాక్ దక్కింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకుంది. దీంతో ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘బచ్చల మల్లి’ మూవీ జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాను థియేటర్‌లో మిస్ అయినవారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తారని మేకర్స్ భావిస్తున్నారు.
ఈ సినిమాలో అందాల భామ అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించగా సుబ్బు మంగాదేవి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మరి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.