ఆ యంగ్ హీరోతో సమంత నెక్స్ట్ మూవీ చేయనుందా..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 16, 2024 8:06 AM IST

స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా చాలా సెలెక్టివ్‌గా చేసుకుంటూ వెళ్తోంది. తాజాగా ఆమె నటిస్తున్న ‘‘సిటాడెల్: హనీ బన్నీ’’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా, ఆమె సెలెక్టివ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.

తన సొంత ప్రొడక్షన్ హౌజ్ ట్రలాల మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఇప్పటికే ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను ప్రొడ్యూస్ చేసిన సమంత, తాజాగా మరో సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించబోతుందట. అయితే, ఈ సినిమాలో ఆమె ప్రియదర్శితో రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రియదర్శితో సమంత జోడీ కట్టనుందనే వార్త ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఇక సమంత పలు చిన్న సినిమాలను తన సొంత బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధమవుతోంది. మరి ప్రియదర్శి-సమంత కాంబినేషన్‌లో నిజంగానే సినిమా వస్తుందా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *