బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ టాలీవుడ్ ప్రేక్షకులకు ‘సాహో’ మూవీతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన ఈ బ్యూటీ తన అందంతో పాటు యాక్టింగ్‌తో తెలుగు ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసింది. ఆ తరువాత శ్రద్ధా కపూర్‌కి తెలుగులో భారీ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది.
ఇక రీసెంట్‌గా శ్రద్ధా కపూర్ ఓ భారీ ఆఫర్‌ని మిస్ చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ స్పెషల్ సాంగ్ కోసం తొలుత శ్రద్ధా కపూర్‌ని సంప్రదించారు. అయితే, ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆమె స్థానంలో తక్కువ రెమ్యునరేషన్‌కు యంగ్ బ్యూటీ శ్రీలీలతో ‘కిస్సిక్’ సాంగ్ చేయించారు. ఇక ఈ పాటకు సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. అయితే, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టును కూడా శ్రద్ధా వదులుకుందని తెలుస్తోంది.
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్‌గా శ్రద్ధా కపూర్‌ని తీసుకోవాలని ఆమెను అప్రోచ్ అయ్యారట. అయితే, ఆమె కోట్ చేసిన రెమ్యునరేషన్‌తో నిర్మాతలు సైలెంట్‌గా వెనుదిరిగినట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. దీంతో నాని పక్కన నటించే మంచి స్కోప్ ఉన్న పాత్రను శ్రద్ధా మిస్ చేసుకుందని తెలుస్తుంది.
The post మరో క్రేజీ ప్రాజెక్ట్ మిస్ చేసుకున్న శ్రద్ధా కపూర్..? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.