అఖిల్ సినిమాలో బాలీవుడ్ విలన్..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Jan 4, 2025 2:05 AM IST

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన కొత్త చిత్రాన్ని తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు. ‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అఖిల్, ప్రస్తుతం మురళీకృష్ణ అబ్బూరి దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా స్టార్ట్ అయినట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో అఖిల్ పాత్రను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడట దర్శకుడు. కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ విలన్ పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘1992 స్కామ్’తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రతీక్ గాంధీ.

ఈ సినిమాలో విలన్ పాత్ర కూడా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. దీంతో ప్రతీక్ గాంధీ అయితే తెలుగు ప్రేక్షకులకు సరికొత్తగా అనిపిస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఈ సినిమాలో నిజంగా ప్రతీక్ గాంధీ నటిస్తున్నాడా.. అనేది అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా అన్నపూర్ణ స్టూడియోస్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *