- అంచనాలను పెంచుతున్న మహేష్-రాజమౌళి మూవీ
- ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ అడ్వెంచర్‌గా మూవీ
- హీరోయిన్ గా బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా
Mahesh Babu : ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు సినిమా నుంచి ఎప్పుడు ఎలాంటి అప్ డేట్ వస్తుందా చెప్పడం కష్టంగా మారింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని చాలా కాలంగా మూవీ లవర్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. అదిగో ఇదిగో అని ఊరించడం తప్ప.. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయంలో క్లారిటీ లేదు. అలాగే క్యాస్టింగ్ ఎవరనేది ఊహాగానాలే తప్ప పూర్తిస్థాయి అధికారిక ప్రకటన లేదు. ఎస్ఎస్‌ఎంబీ 29 ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతుందని ముందునుంచి జక్కన్న చెబుతు వస్తున్నారు. రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ఇదే చెబుతూ వస్తున్నారు.
Read Also: Pushpa Collections : పుష్ప -2 అదే జోరు.. 22 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
మహేష్-రాజమౌళి మూవీ 2025 జనవరిలో సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు తెలిపారు. తాజాగా ఆయన ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొనగా.. ఎస్ఎస్‌ఎంబీ 29 గురించి అడగ్గా జనవరిలో చిత్రీకరణ మొదలువుతుందని చెప్పారు. ప్రస్తుతం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అటు మహేష్ బాబు సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు. ఇప్పటికే లాంగ్ హెయిర్, భారీ గడ్డంతో మహేష్ కనిపిస్తున్నారు. అలాగే బాడీ బిల్డ్ చేసే పనిలో కూడా పడ్డారు. ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో నెలకొన్నాయి.
Read Also:Off The Record: మాజీ మంత్రి రోజా గేర్ మార్చారా..? ఫ్లవర్ కాదు ఫైర్.. వైల్డ్ ఫైర్ అంటున్నారా?
ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్, బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను చిత్ర యూనిట్ సెలక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమాకు ప్రియాంక చోప్రా అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందని మేకర్స్ ఆమెను ఓకే చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. వచ్చే జనవరిలో సినిమా షూటింగ్ మొదలుపెట్టన్నారట జక్కన్న. అయితే సినిమా రిలీజ్ ఎప్పుడు? అనేది చెప్పడం మాత్రం కష్టం.