‘ఫౌజీ’లో జాయిన్ అయిన ప్రభాస్..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 26, 2024 4:18 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన నటించిన ‘ది రాజా సాబ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌కి సంబంధించిన మోషన్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ మోషన్ పోస్టర్‌కి ప్రేక్షకుల నుండి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా పూర్తవక ముందే, ప్రభాస్ తన నెక్స్ట్ మూవీని కూడా స్టార్ట్ చేశాడు.

దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఓ పీరియాడిక్ వార్ అండ్ రొమాంటిక్ మూవీలో ప్రభాస్ నటించనున్నాడు. ఇప్పటికే అధికారికంగా లాంచ్ అయిన ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్‌గా స్టార్ట్ అయ్యింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్‌లో ప్రభాస్ కూడా జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. పీరియాడిక్ వార్‌కి సంబంధించిన సెట్స్‌లో ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జరుగుతోందని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *