Published on Dec 16, 2024 9:53 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జు్న్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తోంది. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తోంది. సౌత్, నార్త్ అంటూ తేడా లేకుండా ఈ మూవీకి అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి.
ఇక థియేటర్లలో ఈ సినిమా ప్రభంజనం కొనసాగుతుండటంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి ప్రస్తుతం సినీ సర్కిల్స్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప-2’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాను జనవరి 9 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సంక్రాంతి రేస్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యే టైమ్‌కి ‘పుష్ప-2’ ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వస్తే, పండుగ సీజన్‌లో ఓటీటీ వ్యూయర్‌షిప్ కూడా అధికంగా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఈ చిత్రాన్ని ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారో చూడాలి.