Pushpa 2: ‘పుష్ప-2’ ట్రైలర్ వచ్చేది అప్పుడేనా..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 16, 2024 11:01 AM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండగా, బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప’కి ఇది సీక్వెల్‌గా రానుంది. ఇక ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌లకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. కాగా, ఈ సినిమా ట్రైలర్‌ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ ట్రైలర్‌ని నవంబర్ రెండో వారంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అంతేగాక, ఆ తరువాత ఈ సినిమాలోని ఐటెం సాంగ్‌ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.

ఈ వార్తతో అభిమానులు ‘పుష్ప-2’ ట్రైలర్ కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, ఫహాద్ ఫాజిల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *