నాని సినిమాకు ఇలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారా..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings


న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో స్పీడుమీద ఉన్నాడు. ఇప్పటికే ఆయన ‘హిట్-3’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉండగా, రీసెంట్‌గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో స్టార్ట్ చేశాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం వచ్చింది. దీంతో ఇప్పుడు రెండోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై అప్పుడే అంచనాలు ఏర్పడుతున్నాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త చక్కర్లు కొట్టినా అభిమానులు అలెర్ట్ అవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాని-ఓదెల 2 ప్రాజెక్ట్‌కి ‘నాయుడుగారి తాలూకా’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా ఓ వార్త వినిపిస్తోంది. దీంతో అసలు ఈ సినిమా కథ ఏమై ఉంటుందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. కానీ, ఇలాంటి టైటిల్ సినిమాకు పెడితే అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందని వారు చర్చించుకుంటున్నారు.

ఏదేమైనా నాని లాంటి సక్సెస్‌ఫుల్ హీరో చిత్రానికి ఎలాంటి టైటిల్ పెట్టాలో మేకర్స్ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు.

The post నాని సినిమాకు ఇలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారా..? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *