రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘సి 202’ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కెఎ నిర్మాతగా మున్నా కాశీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘సి 202’. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై.విజయ, అర్చన ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇది మంచి కంటెంట్ ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్ కథ. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘ఎ’ సర్టిఫికెట్‌తో అక్టోబర్ 25న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో మున్నా కాశీ సరసన గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ట్రైలర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. కేవలం నటీనటుల హావభావాలతో అందరినీ ఆకట్టుకున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ ఈ చిత్రానికి ప్రధాన బలం అని ట్రైలర్ చూస్తే అందరికీ అర్థం అవుతుంది.

ఇక ఇలాంటి టెక్నికల్ బ్రిల్లియెన్స్‌తో తీసిన చిత్రాన్ని ఆడియెన్స్ కచ్చితంగా ఆదరిస్తారని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అక్టోబర్ 25న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుందని మేకర్స్ వెల్లడించారు.

The post రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘సి 202’ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *