ప్రముఖ ఓటిటితో కార్టూన్ నెట్వర్క్ ఒప్పందం.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 12, 2024 1:01 PM IST

వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి పాపులర్ కార్టూన్ ఛానెల్స్ లో కార్టూన్ నెట్వర్క్ అంటే తెలియని ఎవరూ ఉండరు. ఇంగ్లీష్ ఆడియెన్స్ నుంచే కాకుండా మన తెలుగు సహా ఇండియన్ భాషల్లో దాదాపు అందరికీ ఈ ఛానెల్ కానీ అందులో షోస్ కానీ తెలిసే ఉంటుంది. అయితే ఈ ఛానెల్ ఎన్నో ఏళ్ళు తరబడి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ వచ్చింది.

కానీ ఈ మధ్య లోనే ఎన్నోసార్లు ఛానెల్ ఆపేస్తున్నారని పలు రూమర్స్ కూడా వచ్చేవి కానీ ఫైనల్ గా ఇపుడు ఓ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రెస్ అయితే బయటకి వచ్చింది. కార్టూన్ నెట్వర్క్ లోని పలు పాపులర్ షోస్ ని ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ తీసుకుంది. కాకపోతే అందులో కూడా సబ్ స్క్రిప్షన్ తీసుకొనే చూడాల్సి ఉందట.

మరి ఆ ఓటిటి యాపే అమెజాన్ ప్రైమ్ వీడియో. వీరితో కార్టూన్ నెట్వర్క్ ఒప్పందం చేసుకోగా అందులో ఆ ఛానెల్ వారి కొన్ని క్లాసిక్ కార్టూన్స్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి వీటిని చూడాలి అంటే ప్రైమ్ వీడియోలో ఏడాదికి 199 చెల్లించి చూడొచ్చు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *