1000 కోట్ల క్లబ్ లోకి యునానిమస్ గా అల్లు అర్జున్!? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 3, 2024 12:01 AM IST

ప్రస్తుతం నేషన్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పుష్ప-2’ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని సినీ లవర్స్ అంటున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్‌లో నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్.

అయితే, ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ సేల్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు భారీగా పెంచుకునేందుకు ఇక్కడి ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ‘పుష్ప-2’ టికెట్ రేట్లు భారీగా పెరిగాయి. అయితే, ఇప్పుడు ఇదే విషయంపై తెలంగాణ హై కోర్టులో ఓ కేసు కూడా నమోదైంది. మల్టీప్లెక్స్‌లో రూ.531, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.354 టికెట్ రేట్ల ధరలు ఉండటంతో ఈ కేసును నమోదు చేశారు.

ఈ టికెట్ రేట్ల కేసును హై కోర్టు మంగళవారం రోజున విచారణ జరపనుంది. మరి ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *