
తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని అందాల తార క్యాథరిన్ ట్రెసా (Catherine Tresa), ఓ వైపు నటనతో, మరోవైపు గ్లామర్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. చమ్మక్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ, ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో చిత్రంలో అల్లు అర్జున్ సరసన కనిపించి ఆకట్టుకుంది.
తరువాత సరైనోడు సినిమాలో ఆమె చేసిన పవర్‌ఫుల్ పాత్రతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయినప్పటికీ, సినిమాలు హిట్స్ అయినా, ఆమెకు అనుకున్న స్థాయి క్రేజ్ రావడంలో మాత్రం కొంత వెనుకబడిపోయింది. బింబిసార వంటి విజయవంతమైన చిత్రాల్లో కనిపించినా, క్యాథరిన్‌కు అదే స్థాయిలో అవకాశాలు రావడం లేదు.
గత రెండేళ్లుగా క్యాథరిన్ సినిమాలకు దూరంగా ఉంది. చివరిసారి ఆమె 2022లో నితిన్ హీరోగా వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో కనిపించింది. తాజాగా, తనకు ఉన్న ఒక అరుదైన ఆరోగ్య సమస్యను సోషల్ మీడియా వేదికగా వెల్లడించి వార్తల్లో నిలిచింది.
ఇక సోషల్ మీడియాలో మాత్రం క్యాథరిన్ తరచూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన గ్లామరస్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమాలకు గ్యాప్ వచ్చినా, క్యాథరిన్ ట్రెసా అందం, ఆకర్షణ మాత్రం ఏమాత్రం తగ్గలేదని అభిమానులు చెబుతున్నారు.