
మహానాయకుడు ఛత్రపతి శివాజీ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ గ్రాండ్ హిస్టారికల్ మూవీ, దాదాపు ₹130 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయినా, తర్వాత ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతూ కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది.
ప్రారంభ రోజున కేవలం ₹33 కోట్ల గ్రాస్ కలెక్షన్ మాత్రమే సాధించినా, పాజిటివ్ వర్డ్-ఆఫ్-మౌత్ తో నాలుగు రోజుల్లోనే ₹121 కోట్లు దాటింది. ప్రేక్షకుల్లో పెరిగిన ఆసక్తితో పాటు, విక్కీ కౌషల్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ కు వచ్చిన ప్రశంసల వల్ల సినిమా వేగంగా రికార్డులు తిరగరాస్తోంది.
ఈ సినిమా విజయం సినీ పరిశ్రమలో హిస్టారికల్ డ్రామాలకు ఉన్న డిమాండ్‌ను మరోసారి నిరూపించింది. కథనంలోని పవర్, గ్రాండ్ విజువల్స్, డైరెక్షన్, విక్కీ కౌషల్ నటన—ఈ అన్ని అంశాలు కలిసి ఈ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి.
ఇప్పటి వరకు వస్తున్న కలెక్షన్లను చూస్తే, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. మరి ఈ సినిమా హిట్ రన్ ఎక్కడ వరకూ కొనసాగుతుందో చూడాలి!