
బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఛావా’ అంచనాలు లేకుండానే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఫిబ్రవరి 14న హిందీలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలన విజయం సాధించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించగా, మడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా ప్రేక్షకులను అలరిస్తోంది.
ఈ విజయవంతమైన చిత్రాన్ని గీతా ఆర్ట్స్ తెలుగులో మార్చి 7న విడుదల చేయనుంది. ఇటీవల తెలుగు ట్రైలర్ విడుదల కాగా, అది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పవర్ఫుల్ డైలాగులు, గ్రాండ్ విజువల్స్, యుద్ధ సన్నివేశాలు ట్రైలర్లో హైలైట్‌గా నిలిచాయి. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు తెలుగులో కూడా ఈ సినిమా భారీ విజయం సాధించగలదా? అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
తెలుగు ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా విక్కీ కౌశల్ నటన, రష్మిక మందన్న గ్లామర్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేలా డబ్బింగ్ కూడా ఆకట్టుకునేలా ఉంది. సినిమా కథలోని భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్ హిస్టారికల్ జానర్‌కు కొత్త ప్రాముఖ్యత తెచ్చాయి.
బాలీవుడ్లో విజయం సాధించిన ‘ఛావా’ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. విక్కీ కౌశల్, రష్మిక మందన్న జోడీ, లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్, గీతా ఆర్ట్స్ విడుదల ఈ సినిమాకు బలంగా నిలుస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతుందా? అనేది మార్చి 7న ప్రేక్షకుల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.