పుష్ప -2 సినిమా ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఈ ఘటనలో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయగా ఇప్పుడు సినీనటుడు అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అయితే అనుమతులు లేకుండా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లాడని పోలీసులు అర్జున్ పై కేసు నమోదు చేసారు. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఘటనలో నమోదైన కేసును కొట్టేయాలని పిటీషన్. అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చిన పోలీసులు. తనపై నమోదైన కేసులో కొట్టేయాలని పిటీషన్లో కోరిన అల్లు అర్జున్