Published on Oct 26, 2024 12:13 PM IST
మన తెలుగు సినిమా గర్వించదగ్గ అతి కొద్ది మంది నటుల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు మరి మెగాస్టార్ చిరంజీవి సినిమా ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్ళు అయ్యింది. కానీ వెండితెర కంటే ముందే చిరు నటుడుగా అలాగే నాట్యకారునిగా కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అయితే తాను లేటెస్ట్ గా ఒక అరుదైన మెమొరీ షేర్ చేసుకోవడం వైరల్ గా మారింది. తాను తన బికాం చదువుతున్న కాలేజీ రోజుల్లో వేసిన నాటకం కోసం ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.
‘రాజీనామా’ వైఎన్ఎం కాలేజీ నర్సాపూర్ లో ‘రంగస్థలం’ మీద తొలి నాటకం .. కోన గోవింద రావు గారి రచన; నటుడిగా తొలి గుర్తింపు ..అది ఉత్తమ నటుడు కావటం.. ఎనలేని ప్రోత్సాహం..1974 నుంచి 2024 కి 50 సంవత్సరాలు తన నట ప్రస్థానంకి పూర్తయ్యింది అని దీని విషయంలో ఎనలేని ఆనందంగా ఉన్నట్టుగా చిరు పోస్ట్ చేశారు. అలాగే ఇందులో తన యుక్త వయస్సులో ఉన్న పిక్ పేపర్ కట్ నుంచి షేర్ చేయడం విశేషం. మరి ఈ పోస్ట్ చూసి మెగా అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
‘రాజీనామా’ .. Y N M College Narsapur లో ‘రంగస్థలం’ మీద తొలి నాటకం .. కోన గోవింద రావు గారి రచన; నటుడిగా తొలి గుర్తింపు .. అది Best Actor కావటం .. ఎనలేని ప్రోత్సాహం .. 1974 -2024 ; 50 సంవత్సరాల నట ప్రస్థానం .. ఎనలేని ఆనందం ! ???? pic.twitter.com/CfobnApui8
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 26, 2024