మెగాస్టార్ చిరంజీవి ‘హిట్లర్’ రీ-రిలీజ్ వాయిదా! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘హిట్లర్’ ఇప్పుడు నూతన సంవత్సర కానుకగా రీ-రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి పర్ఫార్మెన్స్‌ను మరోసారి వెండితెరపై చూసి ఎంజాయ్ చేయాలని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.

ఇక న్యూ ఇయర్ గిఫ్ట్‌గా హిట్లర్ చిత్రాన్ని జనవరి 1న గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌కు ఓ షాకింగ్ న్యూస్ ఇచ్చారు మేకర్స్. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఈ సినిమా రీ-రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. క్వాలిటీ పరంగా అభిమానులకు మెరుగైన అనుభూతిని ఇచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని.. అభిమానులు మరికొద్ది రోజులు వెయిట్ చేయవలసిందిగా మేకర్స్ కోరారు.

దీంతో ఈ సినిమాను తిరిగి ఎప్పుడు రీ-రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కానుండటంతో ఈ సినిమాను చూసేందుకు మెగా ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు.

The post మెగాస్టార్ చిరంజీవి ‘హిట్లర్’ రీ-రిలీజ్ వాయిదా! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *