దర్శకుడు శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య వివాహం నిన్న జరిగింది. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు. చెన్నైలో జరిగిన ఈ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొన్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిరంజీవి, సురేఖ దంపతులు, రామ్ చరణ్, ఉపాసన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఐశ్వర్య పెళ్లి తరుణ్ కార్తీక్ తో జరిగింది. తరుణ్ కార్తీక్ శంకర్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.