Chiru Odela Project : చిరు – ఓదెల ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డే్ట్.. ఇది కదా కావాల్సింది

  • చిరు ఓదెల సినిమాలో నో హీరోయిన్ నో సాంగ్స్
  • క్లారిటీ ఇచ్చిన చిత్ర నిర్మాత సుధాకర్
  • ఫుల్ ఖుషీ అవుతున్న అభిమానులు

Chiru Odela Project : టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి.. ఆయన ప్రస్తుతం హీరోగా చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “విశ్వంభర”. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఏ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుందో అందరికీ తెలిసిందే. మరి యువ దర్శకుడు వశిష్ఠతో చేస్తున్న ఈ భారీ సినిమాపై మంచి అంచనాలు ముందు నుంచి కూడా ఉన్నాయి. ఇక ఈ చిత్రం తర్వాత చిరు నుంచి పవర్ఫుల్ లైనప్ ఉండగా వాటిలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో క్రేజీ యాక్షన్ డ్రామా కూడా ఒకటి. తన మొదటి సినిమా ‘ దసరా ‘తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు తన సెకండ్ మూవీని నానితో చేస్తున్నారు. ‘ది పారడైజ్’ అనే ఈ మూవీ పూర్తి అయిన తర్వాత ఓదెల – చిరు ప్రాజెక్ట్ మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి – ఓదెల కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ ఉండదని, పాటలు కూడా ఉండే అవకాశం లేదన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రొడ్యూసర్ స్పందిస్తూ ఈ రూమర్లపై క్లారిటీ ఇచ్చారు.

Read Also:PKL 2024 Final: నేడు ప్రొ కబడ్డీ ఫైనల్ మ్యాచ్.. టైటిల్ పోరులో పాట్నా, హర్యానా..

ఈ చిత్ర నిర్మాత ఎస్ఎల్వీ సినిమాస్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. తాము ఈ చిత్రాన్ని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లుగా తెలిపారు. అలాగే ప్రస్తుతానికి కొన్ని రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తేల్చేసారు. అలాగే ఇంకా స్క్రిప్ట్ పూర్తి అయ్యే పనిలో ఉందని తెలిపారు. అయితే సంగీత దర్శకుడిగా అనిరుధ్ పై కూడా హింట్ ఇచ్చారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు పెద్దగా ఎక్స్ పీరియన్స్ లేకపోయినా తను తీసిన ‘దసరా’ సినిమా అద్భుతంగా ఉండడంతో… ఈ యువ దర్శకుడి టాలెంట్ ని నమ్మి చిరంజీవి అవకాశం ఇచ్చారు. ఇక ఈ మూవీ వయలెంట్ గా ఉండబోతుందని ఇప్పటికే వెల్లడించారు. అందుకే చిరు – ఓదెల ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. పైగా ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ తో కలిసి నాని నిర్మించబోతున్నారు. తాజాగా ఎస్ఎల్వీ సినిమాస్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Read Also:MLC Kavitha: నేడు నిజామాబాద్‌కు ఎమ్మెల్సీ కవిత.. ఇందల్వాయి టోల్ గేట్ వద్ద నుంచి భారీ ర్యాలీ

మెగా 156 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ ఒక పీరియాడిక్ డ్రామా అని ఆయన చెప్పారు. అయితే ఈ మూవీలో అసలు హీరోయిన్ ఉండదని, పాటలు కూడా ఉండబోవని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో వాటి గురించి మాట్లాడుతూ నిర్మాత సుధాకర్ చెరుకూరి క్లారిటీ ఇచ్చారు. “సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా ఈ సినిమాలో పాటలు లేవు అనేది అవాస్తవం. సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్లను ఇప్పటికే ఫిక్స్ చేసాం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ డెవలప్ మెంట్ స్టేజ్ లో ఉంది” అని వెల్లడించారు. దీంతో ఇప్పటిదాకా ‘చిరు 156’ మూవీ గురించి జరిగిన ఫేక్ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లు అయింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *