మెగాస్టార్ చిరు వరుసగా యంగ్ దర్శకులతో సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మొన్నామధ్య దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమాను ప్రకటించారు మెగాస్టార్. పూర్తిగా అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానుంది. నాని తో చేస్తున్న ది ప్యారడైజ్ సినిమా ఫినిష్ చేసాక మెగాస్టార్ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు శ్రీకాంత్ ఓదెల. నేచురల్ స్టార్ నాని, సుధాకర్ చెరుకూరి ఇద్దరు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.
ఈ సినిమాతో మరొక యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనిల్ రావిపూడి స్టోరీ చెప్పడం అందుకు చిరు ఒకే చేయేసేయడం చక చక జరిగిపోయాయట. అయితే ఈ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నుండి షూట్ మొదలవ్వచ్చని సమాచారం. త్వరలోనే ఎనౌన్స్ మెంట్ ఉండొచ్చు. ఈ కాంబో సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించనున్నారు. ప్రస్తుతం అనిల్ డైరెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఆ సినిమాను ప్రమోషన్స్ ముగించి చిరు సినిమాకు కథపై తుది మెరుగులు దిద్ది సమ్మర్ లో షూట్ స్టార్ట్ చేసి జెర్ స్పీడ్ లో సినిమాను ఫినిష్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ఇద్దరు యంగ్ దర్శకులతో చేస్తున్నసినిమాలు చిరు మళ్ళి సక్సెస్ ట్రాక్ లో ఎక్కుతారని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మరొక యంగ్ డైరెక్టర్ తో చిరు చేసిన విశ్వంభర వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.