‘దేవర’ నుండి చుట్టమల్లె వీడియో సాంగ్ రిలీజ్! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

మ్యా్న్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేయగా, పూర్తి యాక్షన్ రివెంజ్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్‌కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లుగా మేకర్స్ వెల్లడించారు. అయితే, ఈ సినిమా నుండి తాజాగా ‘చుట్టమల్లె’ వీడియో సాంగ్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట లిరికల్ సాంగ్‌కి సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పాటలో ఎన్టీఆర్ డ్యాన్స్‌తో పాటు జాన్వీ అందాలను వీక్షించేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు.

ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాయి. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్‌కి వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The post ‘దేవర’ నుండి చుట్టమల్లె వీడియో సాంగ్ రిలీజ్! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *