- నేడు సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
- ఇవాళ ఉదయం బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం..
- సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులతో సీఎం రేవంత్ భేటీ..
CM Revanth Reddy: నేడు సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం జరగనుంది. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరుకానున్నారు. సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నారు. ప్రధానంగా తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితోపాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, గద్దర్ అవార్డుల పరిశీలన, ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనలు, టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల రద్దు విషయాలను భేటీలో చర్చించే అవకాశం ఉంది.
Read also: CWC meeting: నేటి నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలు
నిర్మాతలు
దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, నిర్మాత చినబాబు, నిర్మాత నాగవంశీ, పుష్ప నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, సుధాకర్ రెడ్డి, స్రవంతి రవి కిషోర్ తదితరులు పాల్గొననున్నారు.
హీరోలు
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, శివ బాలాజీ హాజరు కానున్నారు.
దర్శకుల సంఘం నుంచి
అధ్యక్షుడు వీర శంకర్, డైరెక్టర్ సాయి రాజేష్, విశ్వంభర డైరెక్టర్ వశిష్ట , త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీ శంకర్, అనిల్ రావిపూడి, బాబీ హాజరు.
తెలుగు ఫిలిం ఛాంబర్
ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ చౌదరి, సెక్రటరీ దామోదర్ ప్రసాద్ హాజరు.
మా అసోసియేషన్
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి మరియు ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి పలువురు ప్రతినిధులు హాజరు కానున్నారు
Astrology: డిసెంబర్ 26, శుక్రవారం దినఫలాలు